skip to main |
skip to sidebar
అసలు ఇలియానా ఎవరో తెలియదు ?
 |
ఇలియానా |
ఇటీవల ఇలియానా ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. "వన్స్ అపాన్ ఎ టైం ఇన్ ఇండియా" అనే చిత్రం లో అక్షయ్ కుమార్ సరసన ఇలియానా నటిస్తోంది అనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రం లో ఇలియానా "మందాకిని" పాత్రని పోషిస్తోంది అని పేర్కొనడం జరిగింది. అయితే ఇదే విషయం గురించి ఈ సినిమా దర్శకుడు మిలినా బధ్రియా దగ్గర ప్రశ్నించినపుడు ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పాడు. అంతే కాకుండా అసలు ఇలియానా అంటే ఎవరో కూడా తెలియదని పేర్కొన్నాడట. దర్శకుడి మాటలను బట్టి ఇలియానా ఈ సినిమా లో ఉండదనే విషయం స్పష్టం అవుతుంది.