skip to main |
skip to sidebar
స్వంత వాయిస్ తో కాజల్ అగర్వాల్
|
కాజల్ అగర్వాల్ |
ఈ మధ్యన హీరోయిన్ లు తమ క్యారక్టర్ కి తమే వాయిస్ చెప్పుకుంటూ సంథింగ్ స్పెషల్ అని చాటుకుంటున్నారు. ఇటీవల విడుదలయిన హిట్ చిత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్ లో తాప్సీ ఇలాగే డబ్బింగ్ చెప్పుకొని తన సత్తా చాటింది. కానీ అదే సినిమా లో నటించిన కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. దాదాపు అందరి అగ్ర హీరోలతోను నటించిన కాజల్ టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. అయితే తన తాజా చిత్రం లో తనే స్వంతం గా డబ్బింగ్ చెప్పుకోనుందట. నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటింస్తోంది. ఈ సినిమా లో తనే స్వంతం గా డబ్బింగ్ చెప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.