April 12, 2011

మహేష్ బాబు vs జూనియర్ ఎన్ టి ఆర్ - ఎవరి చేతిలో ఎన్ని యాడ్ బ్రాండులున్నాయి ?

Mahesh NTR
ఇప్పటివరకు టాలీవుడ్ లో అడ్వర్టైజ్‌మెంట్ రంగంలో దూసుకు పోతున్న తెలుగు హీరో ఎవరైన ఉన్నారా అంటే మొదటగా గుర్తొచ్చేది ప్రిన్స్ మహేష్ బాబు. ఇప్పుడు దానికి గట్టి పోటీ నిస్తోంది జూనియర్ ఎన్ టి ఆర్ అని అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్ టి ఆర్ సైతం తన సత్త ఏంటో చూపిస్తున్నాడు. మహేష్ బాబు కూల్‌డ్రింక్స్, మొబైల్, షాంపూ, షేవింగ్ బ్లేడ్, సెల్యులార్ కంపెనీ, హెయిర్ బ్రాండ్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు. వీటి ద్వారా మహేష్ బాబు కి ఏడాదికి 20 కోట్ల వరకు వస్తున్నట్లు సమాచారం. మహేష్ తో పాటు రాంచరణ్, అల్లు అర్జున్ మరియు నాగార్జున లాంటి వారు యాడ్స్ రంగంలో ఉన్నప్పటికి వీరెవరు ప్రిన్స్ మహేష్ బాబు కి గట్టి పోటీ ఇచ్చినట్లు అనిపించలేదు.

                                     కానీ జూనియర్ ఎన్ టి ఆర్ ఈ స్థానాన్ని భర్తీ చేసినట్టు తెలుస్తోంది. ఎన్ టి ఆర్ తొలి యాడ్ జండు బాం. దీని తర్వాత ఒక టాల్కం పౌడర్, మలబార్ గోల్డ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదంతా చూస్తే జూనియర్ ఎన్ టి ఆర్ మాత్రం తనదైన శైలిలో మహేష్ బాబు కి గట్టి పోటీ ఇస్తున్నట్లు అనిపిస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...